![]() |
![]() |

కిర్రాక్ బాయ్స్ అండ్ గర్ల్స్ షోలో కొత్త లవ్ స్టోరీ బయట పడిందా ? అంటే అక్కడ ఆ షోలో ఆ విషయం కనిపిస్తోంది. ఐతే అది నిజమా, అబద్దమా అనే విషయన్ని పక్కన పెడితే అసలు నిఖిల్ - రీతూ మధ్య ఎం జరుగుతోందో అర్ధం కావడం లేదు. శ్రీముఖి టేస్టీ తేజతో డాన్స్ చేయమన్నప్పుడల్లా మూతి ముడుచుకుంటూ ఉంటుంది. ఈ విషయన్ని శ్రీముఖి పసి గట్టింది. "శ్రీముఖి నేను వేరే పీస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా" అనేసరికి " నీకు ఏ పీస్ నచ్చిందో చెప్పు" అని అడిగింది. "నాకు నచ్చిన పీస్ సోఫాలో లేదు ఈ స్టేజి మీదే ఉంది" అని చెప్పింది రీతూ. "నాకు తెలుసు ఆ మనిషి ఎవరో"..అంటూ నిఖిల్ ని తీసుకొచ్చింది శ్రీముఖి. "మనకు తెలీకుండా ఇక్కడ ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తోంది" అని చెప్పేసరికి నిఖిల్ గట్టిగా కాదు అన్నట్టు అరిచాడు.. "అదేంటి బ్రేక్ లో ఓకే అన్నావ్" అంటూ నిఖిల్ మీద మండిపడింది రీతూ. దానికి నిఖిల్ షాక్ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి "ఓ మై బేబీ" అని సాంగ్ కి డాన్స్ చేశారు. రీతూ నిఖిల్ ని తెగ ముద్దులు పెట్టేసుకుంది.
ఇక నిఖిల్ పై ఇంకో అమ్మాయి కూడా మనసు పారేసుకుంది అంటూ విష్ణు ప్రియను చూపించింది శ్రీముఖి. దాంతో విష్ణు ప్రియా కూడా వెళ్లి అదే సాంగ్ కి నిఖిల్ తో కలిసి డాన్స్ చేసింది. "ఇద్దరూ కలిసి ఒకరి మీదే మనసు పారేసుకున్నారు" అంది శ్రీముఖి. వీళ్ళు డాన్స్ చేస్తుంటే రీతూ ఫీలింగ్స్ ని అందరూ చూసారు చూడడమే కాదు దాన్ని మళ్ళీ ప్లే చేసి చూపించారు. అది చూసిన శ్రీముఖి "ఈ కష్టం ఎవరికీ రాకూడదు" అంది శ్రీముఖి. ఇంతకు నిఖిల్ - కావ్య మధ్య ఎం జరిగిందో తెలీదు. ఏ షోలో ఐనా వీళ్ళిద్దరూ కచ్చితంగా కనిపించే వాళ్ళు కానీ ఈ షోలో మాత్రం కావ్య కనిపించలేదు. మధ్యలో ఇప్పుడు రీతూ కనిపించేసరికి ఫాన్స్ అంతా కావ్య ఏమయ్యిందంటూ ఆరా తీస్తున్నారు.
![]() |
![]() |